Producer SKN: ‘దయచేసి వారి ఉచ్చులో పడొద్దు’.. బేబీ నిర్మాత ఎస్కేఎన్ రిక్వెస్ట్

ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా తెలుగు హీరోయిన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నెటిజన్లు కూడా విమర్శలు గుప్పించారు. దీంతో ఎస్కేఎన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు

Producer SKN: దయచేసి వారి ఉచ్చులో పడొద్దు.. బేబీ నిర్మాత ఎస్కేఎన్ రిక్వెస్ట్
Producer SKN

Updated on: Feb 21, 2025 | 4:02 PM

బేబీ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు నిర్మాత ఎస్కేఎన్. అంతకు ముందు కూడా ఆయన పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే బేబీ సినిమాతోనే ఎక్కువగా ఫేమ్ సొంతం చేసుకున్నారు. కాగా మెగా ఫ్యామిలీని అమితంగా ఆరాధించే ఎస్కేఎన్ తరచూ తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ఒక్కొక్కసారి ఆయన వ్యాఖ్యలు శ్రుతిమించుతుంటాయి. ఇదే క్రమంలో డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు హీరోయిన్లపై ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అయితే వివాదం పెద్దది కాకముందే తన వ్యాఖ్యలకు ఆయన పూర్తి వివరణ ఇచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్కేఎన్ తాజాగా ఒక ఆసక్తికర పోస్టును షేర్ చేశారు. బెట్టింగ్ యాప్‌‌ల ఉచ్చులో పడొద్దని, ఎవరూ వీటిని ప్రమోట్ చేయద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

‘ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకున్నామని సహాయం కోసం అభ్యర్థిస్తున్న వ్యక్తులు చాలా తక్కువ.
సోదరులారా దయచేసి ఈ యాప్‌లతో జాగ్రత్తగా ఉండండి. సులభంగా డబ్బు వస్తుందని టెంప్ట్ అవకండి. ఈ యాప్‌లు దోచుకోవడానికి రూపొందించబడ్డాయి కానీ మీకు ఎలాంటి సహాయం చేయవు. దయచేసి మీరు ఈ ఉచ్చులో పడకండి.. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోకండి’ అని ఎస్కేఎన్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

నిర్మాత ఎస్కేఎన్ ట్వీట్..

కాగా ఇటీవల కొందరు ఫేమస్ యూట్యూబర్లు అదే పనిగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. వీటి మాయాలో పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.