Producer NattiKumar: నా సినిమాలు తెలంగాణలో రిలీజ్ చేయను.. నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు..

|

Dec 30, 2021 | 7:38 PM

టాలీవుడ్ ప్రొడ్యుసర్ నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్స్ అధికంగా ఉన్నందుకు

Producer NattiKumar: నా సినిమాలు తెలంగాణలో రిలీజ్ చేయను.. నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు..
Nattikumar
Follow us on

టాలీవుడ్ ప్రొడ్యుసర్ నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్స్ అధికంగా ఉన్నందుకు ఇకపై తాను నిర్మించే సినిమాలు తెలంగాణలో విడుదలచేయనని తెలిపాడు. అలాగే థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు నిర్మాత నట్టికుమార్.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించలేదని.. జీవో 35ను క్యాన్సిల్ చేయాలని 224 మందికి తెలియకుండా కొంతమంది కోర్టుకు వెళ్లి కంప్లైంట్ చేశారన్నారు. దీని గురించి అసలు విషయాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు నిర్మాత నట్టికుమార్. ఈ సమస్య వెనుక టాప్ 3లో ఉన్న వ్యక్తి దీని వెనుక వున్నాడని..ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసన్నారు నట్టి కుమార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్లుగా విభజన చేయాలని నట్టికుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్ నారాయణ మూర్తి, నేను కలసి పని చేశామన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంకు తమ నుంచి ఓ విజ్ఞప్తి ఉందన్నాడు. తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాలను కాపాడాలని.. పెద్ద సినిమాలు మాత్రమే బాగు పడుతున్నాయని ఆవేదనం వ్యక్తం చేశారు. తెలంగాణలో చిన్న సినిమాలకు 5వ షోకి పర్మిషన్ ఇవ్వాలని .. తెలంగాణలో చిన్న సినిమాలు రిలీజ్ చేయటం చాలా కష్టంగా ఉందన్నారు. అందుకే తాను తన సినిమాలు తెలంగాణలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..