Guntur Kaaram: గుంటూరు కారంలో ఇద్దరు సూపర్ స్టార్స్..! హైప్ పెంచేస్తున్న నిర్మాత నాగవంశీ
త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు ను గురూజీ ఈ సినిమాలో మాస్ అవతార్ లో చూపించనున్నారు. మరికొద్దిరోజుల్లో గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి రానుంది. దాంతో ఈ సినిమానుంచి క్రేజీ పోస్టర్స్, అదిరిపోయే అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. గుంటూరు కారం సినిమా జనవరి 12న సంక్రాంతికానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రోజురోజుకు గుంటూరు కారం సినిమా పై హైప్ బాగా పెరిగిపోతుంది. అసలు సినిమా ఎలా ఉండబోతుంది. త్రివిక్రమ్ ఈ సారి మహేష్‌ను ఎలా చూపించబోతున్నారు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు ను గురూజీ ఈ సినిమాలో మాస్ అవతార్ లో చూపించనున్నారు. మరికొద్దిరోజుల్లో గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి రానుంది. దాంతో ఈ సినిమానుంచి క్రేజీ పోస్టర్స్, అదిరిపోయే అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. గుంటూరు కారం సినిమా జనవరి 12న సంక్రాంతికానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్ళాడు. ఆయన తిరిగి రాగానే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అలాగే అదే రోజు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా పై మొదటి నుంచి నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అభిమానులకు కిక్ ఇచ్చేలా ఆయన హింట్స్ ఇస్తూ సినిమా పై హైప్ ను భారీగా పెంచేశారు. తాజాగా నాగవంశీ గుంటూరు కారం సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. సినిమా ఫస్ట్ ఆఫ్ లో బీజీఎమ్ అదిరిపోతుందని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వరని అన్నారు. అలాగే ఇంట్రెవెల్ సీన్స్ లో మహేష్ బాబు ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని అన్నారు. అదేవిధంగా.. చివరి 45 నిముషాలు, ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్ అదిరిపోతాయని తెలిపారు. ఇక ఫస్ట్ ఆఫ్ లో ఓ భారీ ఫైట్ సీన్ ఉంటుందని.. ఆ ఫైట్ లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఇరగదీయడం చూస్తారు అని అన్నారు నాగవంశీ. దాంతో గుంటూరు కారం సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారని హింట్ ఇచ్చాడు నాగవంశీ. మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారా..? లేక మరో స్టార్ హీరో సినిమాలో ఉన్నారా అనే అనుమానాలతో పాటు హైప్ కూడా పెరిగిపోయింది. అంతే కాదు ట్రైలర్ లో దాని గురించి మీకు తెలుస్తుంది అని అన్నారు నాగవంశీ. దాంతో మహేష్ అభిమానుల్లో అంచనాలు ఇపుడు తార స్థాయికి చేరాయి. మరి ట్రైలర్ లో ఏం చూపిస్తారో తెలియాలంటే జనవరి 6వరకు ఆగాల్సిందే.
Finally! 🤩
Amidst the spiciest moments, get ready for some crazy ones too 😉
Brace yourself to be awestruck in 𝟖 𝐃𝐚𝐲𝐬 ! ❤️🔥#GunturKaaram 😎
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash… pic.twitter.com/yeHfgc4Vwk
— Guntur Kaaram (@GunturKaaram) January 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.