Bunny Vasu : థియేటర్లను కాపాడండి.. పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి.. నిర్మాత బన్నీ వాసు ట్వీట్..

తెలుగు సినీపరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై టాలీవుడ్ ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నిర్మాత బన్నీ వాసు. పర్సంటేజ సిస్టమ్ లో మార్పు కోసం పోరాడటం కంటే, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలి అనే దానిపై దృష్టిపెట్టాలని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

Bunny Vasu : థియేటర్లను కాపాడండి.. పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి.. నిర్మాత బన్నీ వాసు ట్వీట్..
Bunny Vasu

Updated on: Jun 06, 2025 | 11:11 AM

ప్రస్తుతం తెలుగు సినీరంగంలోని థియేటర్ల గురించి ట్వీట్‌ చేశారు నిర్మాత బన్నీ వాసు. పర్సెంటేజీ విధానం గురించి మాట్లాడటం కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలోనని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదన్నారు బన్నీ వాసు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని.. ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడంలో అర్థం లేదన్నారు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలని సూచించారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని చెప్పారు.

పెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారని హెచ్చరించారు. రెండు మూడేళ్ల గ్యాప్‌లో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారని చెప్పారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ ద్వారా పెద్ద ఉపయోగం ఉండదన్నారు. అలా జరిగితే పెద్ద హీరోల సినిమాలకు థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుందని చెప్పారు.

బన్నీ వాసు ట్వీట్.. 

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..