చాలా కాలం తర్వాత యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. GA2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ మూవీలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 4న విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని దస్ బల్ల హోటల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “కోవిడ్ కారణంగా ఈ సినిమా కొన్ని ఇబ్బందులు పడ్డా ఫైనల్ గా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇలాంటి మంచి కథను ఇచ్చిన భరధ్వజ గారికి ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ కుర్రాన్ని మిడిల్ క్లాస్ కు చూయించాలి అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా చక్కని బిహేవియర్ తో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయడం జరిగింది.చూసిన వారందరూ ఫుల్ టైమ్ ఎంజాయ్ చేస్తారు. అయితే తమ్మారెడ్డి భరధ్వజ గారు ఈ సినిమా చూసిన తరువాత నాకు కంటిన్యూ ఫోన్స్ చేస్తుండడంతో తనిచ్చిన కథను మేము సరిగా తియ్యలేకపోయారని అంటాడేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డాము. కానీ తను చాలా బాగా తీశారు అని చెప్పడంతో హ్యాపీ ఫీల్ అయ్యాము.
ఆ తరువాత నా ఫ్రెండ్స్ కు సినిమా చూయిస్తే అందరూ బాగుందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి లు చాలా మంచి పాటలు ఇచ్చారు. అలాగే ఈ నెల 30 న జరుపుకునే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఇక ముఖ్యమైన అతిధి వచ్చి మనకు విశిష్టమైన అప్పిరియన్స్ ఇచ్చే ఆ ఫంక్షన్ చాలా ఇంట్రెస్ట్ గా జరగబోతుంది” అన్నారు.