ఒకప్పుడు వెండితెరపై తనదైన ముద్ర వేసిన అందాల భామల్లో ప్రియమణి(Priyamani)ఒకరు. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో ఇండస్ట్రీలో జగపతి బాబుకు జోడీగా నటించి అడుగు పెట్టిన ఈ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ భామ. అక్కడ కూడా ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లిపీటలెక్కింది ఈ చిన్నది. పెళ్లి తర్వాత సినిమాల్లో స్పీడ్ తగ్గించింది. కొత్త అందాలు ఎంటర్ అవ్వడంతో ఈ అమ్మడికి ఛాన్స్ లు తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోల్లో జడ్జ్ గా వ్యవహరిస్తోంది ప్రియమణి.
అయితే ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా గుర్తు చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సన్నివేశంలో నాభిని చూపించే సన్నివేశం ఉందని.. నాభి దగ్గర టాటూ చూపిస్తూ ఆ సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ముందుగా నాకు దాని గురించి చెప్పలేదు. అయినా సరే నేను చేశాను.. అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. నిజానికి హీరోయిన్స్ సన్నివేశానికి తగ్గట్టుగానే అందాలను చూపిస్తారు. కొన్నిసార్లు ఇష్టం లేకుండా ఇలా అందాలు చూపిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో నటించి మెప్పించింది ప్రియమణి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.