
ప్రముఖ రచయిత ప్రియదర్శిని రామ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వంపై అనేక విశేషాలను చెప్పాడు. ప్రస్తుతం తాను మీడియా రంగానికి పూర్తిగా దూరంగా ఉన్నానని, స్క్రిప్ట్ రైటింగ్‌పైనే తన దృష్టి ఉందని తెలిపాడు. ‘రాయడంలో ఉన్న ఆనందం మరేదాంట్లోనూ లేదు. స్క్రిప్ట్ రైటింగ్ నా సంతోషం’ అని అతడు పేర్కొన్నాడు. తాను రచించిన న్యూసెన్స్, సాండ్‌స్టార్మ్ లాంటి చిత్రాలకు డబ్బులు వచ్చాయని, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కోసం కూడా ఓ కథ రాసినట్లు వెల్లడించాడు. త్రివిక్రమ్, రవి అబ్బూరి లాంటి గొప్ప రచయితలు తనకు స్ఫూర్తి అని, చిన్నతనం నుంచీ వారి రచనలను చూసి ప్రేరణ పొందానని తెలిపాడు. సినిమా అనేది సమాచారాన్ని పంచుకోవడానికి ఒక శక్తివంతమైన మాధ్యమమని అతడు అభిప్రాయపడ్డాడు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
నందమూరి బాలకృష్ణతో తన అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ప్రియదర్శిని రామ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. బాలకృష్ణకు ‘ముక్కోపి’ అనే పేరు ఉన్నా, ఆయనది ‘పసిబిడ్డ మనస్తత్వం’ అని అభివర్ణించాడు. ఓ సంఘటనను ప్రస్తావిస్తూ, ఒక పేద పూజారి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స కోసం కొంత డిస్కౌంట్ అడిగినప్పుడు, తాను బాలకృష్ణకు ఒక మెసేజ్ పంపానని తెలిపాడు. దీనికి బాలకృష్ణ రాత్రి ఎనిమిది గంటలకు ఫోన్ చేసి, ‘హే బాక్సీ, మాట్లాడు. అది నీ ఆసుపత్రి కదా, డిస్కౌంట్ అడగడమేంటి?’ అని మందలించినట్లు చెప్పాడు. బాలకృష్ణ అలా స్పందించడం.. ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. ‘అందరూ గొప్పోళ్ళే అన్న’ అంటూ బాలకృష్ణ దాతృత్వాన్ని కొనియాడారు. ఎయిర్‌పోర్టులో బాలకృష్ణ తనను దూరం నుంచి ‘బాక్సీ’ అని పిలిచిన సంఘటనను కూడా గుర్తుచేసుకున్నారు. కాలేజీ రోజుల్లో తాను బాక్సింగ్ చేసేవాడిని కాబట్టి ఆ పేరు వచ్చిందని వివరించాడు. ఫోటోలు అడగడానికి వచ్చిన వారికి, ‘మీ అమ్మతో, నాన్నతో ఫోటో తీసుకోమని, ఒక సినిమా యాక్టర్‌తో ఫోటో తీసుకోవడం ఏమిటి?’ అని బాలకృష్ణ అన్నారని ప్రియదర్శిని రామ్ తెలిపాడు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..