Prithviraj Sukumaran: అంచనాలు పెంచేసిన ‘ఆడు జీవితం’ ట్రైలర్.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటన వేరేలెవల్..

|

Apr 08, 2023 | 7:21 PM

ఇదిలా ఉంటే ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆడు జీవితం. ప్రయోగాలకు పెద్ద పీట వేసే మలయాళ చిత్రపరిశ్రమ తెరకెక్కిస్తోన్న సర్వైవల్ డ్రామా ఇది. ఇంగ్లీష్ లో ది గోట్ లైఫ్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Prithviraj Sukumaran: అంచనాలు పెంచేసిన ఆడు జీవితం ట్రైలర్.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటన వేరేలెవల్..
Aadu Jeevitham
Follow us on

మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరోకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన సలార్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆడు జీవితం. ప్రయోగాలకు పెద్ద పీట వేసే మలయాళ చిత్రపరిశ్రమ తెరకెక్కిస్తోన్న సర్వైవల్ డ్రామా ఇది. ఇంగ్లీష్ లో ది గోట్ లైఫ్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియన్ మూవీస్ కి మరింత క్రేజ్ పెరిగింది. మలయాళం నుంచి లేటెస్ట్ గా పాన్ ఇండియన్ ను దాటి పాన్ వరల్డ్ అనేలా ఓ కొత్త సినిమా రాబోతోంది. పృథ్వీరాజ్ హీరోగా నటించిన ఈ చిత్రం పేరు ఆడుజీవితం. అయితే తాజాగా విడుదలైన ఈ 3 నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఎడారిలోకి తీసుకువెళ్లింది. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మొహమ్మద్ అనే మలయాళీ ఎన్ని కష్టాలు పడ్డాడు ?.. అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి బాట పట్టిన అతడు ఎలా బతికాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్ లో పృథ్వీరాజ్ తన నటనతో కట్టిపడేశారు. ఎడారిలో ఆహారం దొరక్క బక్క చిక్కిపోయిన వ్యక్తిగా తనను తాను మార్చుకున్న తీరూ అలరిస్తోంది. ఈ సినిమా కోసం కొవిడ్ సమయంలో చిత్రయూనిట్ జోర్దాన్ లోనే 70 రోజులు ఉండిపోవాల్సి వచ్చిందట.

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా కనిపిస్తుంది. ఇద్దరు అకాడమీ అవార్డు గ్రహీతలు A.R.రెహమాన్, రసూల్ పూకుట్టి భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ వంటి టెక్నీషియన్స్ తో ఈ చిత్రం నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రాబోతోంది. సినిమాటోగ్రఫీ సునీల్ K.స్ చేస్తుండగా.. కథను బెన్యామిన్ అందించాడు. ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.