Prince Yawar: అసలు విషయం బయటపెట్టిన యావర్.. అందుకే 15లక్షలు తీసుకున్నానంటూ..
బిగ్ బాస్ ట్రోఫీ కోసం హౌస్ మేట్స్ అంతా గట్టిగానే ప్రయత్నించారు. అర్జున్, శివాజీ, యావర్, అమర్ దీప్ , ప్రియాంక, ప్రశాంత్ టాప్ 6గా నిలవగా అర్జున్, ప్రియాంక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఆతర్వాత యావర్ 15లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చేశాడు. అయితే కొంతమంది యావర్ సూట్ కేసుతో బయటకు రావడం కరెక్ట్ అంటుంటే..

బిగ్ బాస్ హడావిడి ముగిసిపోయింది. సీజన్ సెవన్ లో ఎవరు విన్నర్ అవుతారా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూశారు. ఎట్టకేలకు బిగ్ బాస్ 7 అయిపొయింది. అందరూ అనుకున్నట్టే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ ట్రోఫీ కోసం హౌస్ మేట్స్ అంతా గట్టిగానే ప్రయత్నించారు. అర్జున్, శివాజీ, యావర్, అమర్ దీప్ , ప్రియాంక, ప్రశాంత్ టాప్ 6గా నిలవగా అర్జున్, ప్రియాంక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఆతర్వాత యావర్ 15లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చేశాడు. అయితే కొంతమంది యావర్ సూట్ కేసుతో బయటకు రావడం కరెక్ట్ అంటుంటే.. మరికొంతమంది లాస్ట్ వరకు ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ గురించి యావర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన యావర్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నాడు. గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో యావర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు నా ఫ్యామిలీనే ముఖ్యం.. నేను నా ఫ్యామిలీ కోసమే రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని వచ్చేశా.. టైటిల్ గెలవడమనేది పెద్ద విషయం కాదు అని చెప్పాడుయావర్.
అలాగే హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ.. హౌస్ లో మోస్ట్ కన్నింగ్ పర్సెన్ ఎవరు అన్న ప్రశ్నకు శోభా శెట్టి అని సమాధానం చెప్పాడు యావర్. అలాగే హౌస్ లో మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి అమర్‌దీప్. సింపతీ కోరుకునేది అశ్విని అదేవిధంగా డబుల్ యాక్షన్ చేసేది గౌతమ్ అని సమాధానం ఇచ్చాడు యావర్. నిజానికి తెలుగు రాకపోయినా యావర్ బిగ్ బాస్ 7లో ఫైనల్ వరకు వచ్చాడు.
View this post on Instagram
యావర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
యావర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.