AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సినిమా అంటే! పెద్ద హీరోలు లేరు.. భారీ బడ్జెట్ కాదు!! ఏకంగా కేజీఎఫ్‌ను బీట్ చేసింది

సినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, భారీ ప్రమోషన్స్ ఉండాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తాయి. కథ బాగుంటే, ప్రేక్షకులకు నచ్చితే సినిమా ఎలాంటి హంగామా లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేయగలదని నిరూపించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.

ఇది కదా సినిమా అంటే! పెద్ద హీరోలు లేరు.. భారీ బడ్జెట్ కాదు!! ఏకంగా కేజీఎఫ్‌ను బీట్ చేసింది
Movie
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2026 | 7:28 AM

Share

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కేజీఎఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడమే కాకుండా, యశ్‌ను ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్-2’ సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసి, కన్నడ సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పింది. ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల కంటే, బలమైన కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘హనుమాన్ అంశ్’ అందుకు ఒక నిదర్శనం. తాజాగా మరొక చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచింది.

కన్నడలో కేవలం రూ. 2 నుంచి 3 కోట్ల అంచనా బడ్జెట్‌తో తెరకెక్కిన లేటెస్ట్ ప్రేమకథా చిత్రం ‘ప్రేమద ఊరాలి’ (తెలుగులో ప్రేమనే ఊరిలో). గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాసింది. కేవలం నెల రోజుల్లోనే ఈ చిత్రం రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2018లో విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్-1’ కన్నడ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఆల్‌టైమ్ కలెక్షన్లను రూ. 135 కోట్లు ఈ చిన్న సినిమా అధిగమించడం విశేషం.

దీనితో కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ప్రేమద ఊరాలి’ నాలుగో స్థానానికి చేరుకుంది. భారీ కాస్టింగ్, కోట్ల కొద్దీ బడ్జెట్ కాకుండా.. సరైన కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఎలాంటి హంగులు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీ చూసి సినీ విశ్లేషకులు సైతం షాక్ కు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us