AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: తెగేదాకా లాగొద్దన్న మోనార్క్‌.. టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా ప్రకాష్ రాజ్ ట్వీట్

MAA Elections 2021: తెగేదాకా లాగొద్దు అంటున్నారు మోనార్క్‌ ప్రకాష్‌రాజ్‌. ఫిలింనగర్‌ సెంటర్‌లో మా అధ్యక్ష ఎన్నికలు కాక రేపుతున్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్ చేసి ట్వీట్ వేడి మరింత రాజేసింది

MAA Elections 2021: తెగేదాకా లాగొద్దన్న మోనార్క్‌.. టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా ప్రకాష్ రాజ్ ట్వీట్
Prakash Raj
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2021 | 8:46 PM

Share

Prakash Raj: తెగేదాకా లాగొద్దు అంటున్నారు మోనార్క్‌ ప్రకాష్‌రాజ్‌. ఫిలింనగర్‌ సెంటర్‌లో మా అధ్యక్ష ఎన్నికలు కాక రేపుతున్నాయి. తాజాగా ప్రకాష్ రాజ్ చేసి ట్వీట్ వేడి మరింత రాజేసింది. క్రమశిక్షణ కమిటీ పెద్దల సమక్షంలో నాలుగు రోజుల క్రితమే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. 22వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్నారు. అక్కడ మా అధ్యక్ష ఎన్నికల డేట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. తెగాదాకా లాగొద్దంటూ ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేయడం టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది. ఒక నెల క్రితం మా ఎలక్షన్స్‌ ఎప్పుడు అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్‌రాజ్. ఇప్పుడు తెగేదాకా లాగొద్దనడం రెచ్చగొట్టే ట్వీట్‌గా కొందరు మా సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన పానెల్ సభ్యులను పరిచయం చేసి ఎన్నికలకు సిద్దం అంటూ ప్రకటించగా..మరో అభ్యర్థి మంచు విష్ణు ఏకగ్రీవం అయితే తనకు ఓకే అనే సంకేతాలిచ్చారు. మంచు విష్ణుకు తోడు మరో అభ్యర్థి జీవితా రాజశేఖర్, సీవీఎల్ నరసింహరావు కూడా గొంతు కలపడంతో… ఇండస్ట్రీలోని పెద్దలు మా ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు రంగం సిద్దం చేశారు. కృష్ణం రాజు అధ్యక్షతన ఇటీవలే ఓ వర్చవల్‌ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసుకుని మరీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గతంలో ప్రకాశ్‌ రాజ్‌ మా ఎన్నికలు ఎప్పుడంటూ ట్వీట్‌ చేసి.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ను ట్యాగ్ చేశారు. దానికి నరేష్‌ కూడా కాస్త వ్యంగ్యంగా.. గట్టిగానే.. బదులిచ్చారు. ఇక ఇప్పుడు అంతా సవ్యంగా ఏకగ్రీవం వైపు సాగుతుందనుకున్న సమయంలో ప్రకాశ్‌ రాజ్‌ “తెగేదాకా లాగొద్దంటూ” మరో ట్వీట్ చేసి ఇండస్ట్రీలో నిప్పురాజేశారు. అయితే ఈ ట్వీట్ ప్రకాశ్‌ రాజ్‌ కావాలనే చేశారని మా సభ్యులంటున్నారు. స్వతహాగా ఆవేశపరుడైన ప్రకాశ్‌ రాజ్‌.. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికే ఇలాంటి రెచ్చ గొట్టే ట్వీట్లు చేస్తున్నారని వారంటున్నారు. అంతే కాదు ఈ ట్వీట్‌ ను ‘‘మా’’ క్రమశిక్షణ సంఘం ముందుకు తీసుకొచ్చేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas – Nag Ashwin : నాగ్ అశ్విన్ భారీప్లాన్.. ప్రభాస్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా..?

Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే