Prakash Raj: సినిమాల్లో న‌టించే ఆడవాళ్లంటే చిన్న‌చూపా? మంత్రి కొండా సురేఖపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణమని, ఆయన కారణంగానే చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారంటూ సురేఖ ఆరోపించడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

Prakash Raj: సినిమాల్లో న‌టించే ఆడవాళ్లంటే చిన్న‌చూపా? మంత్రి కొండా సురేఖపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
Konda Surekha, Prakash Raj
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2024 | 4:57 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న ట్రోలింగ్ కు కేటీఆరే కారణమని ఆరోపించిన మంత్రి సురేఖ.. ఇదంతా దుబాయ్ నుంచే ఆపరేట్ చేయిస్తున్నారన్నారు. మహిళలంటే ఆయనకు చిన్న చూపని, సినీ పరిశ్రమలోని హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణమని, ఆయన కారణంగానే చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారంటూ సురేఖ ఆరోపించడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ‘ ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపా?.. జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సినీ నటుల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా గత కొన్నిరోజులుగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ తిరుమల లడ్డూ వివాదంపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు ప్రకాశ్ రాజ్. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఇన్ డైరెక్టుగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ప్రకాశ్ రాజ్.

ఇవి కూడా చదవండి

ప్రకాశ్ రాజ్ ట్వీట్..

జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుసగా ట్వీట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే