Pragathi: నాగిని పాటకు స్టెప్పులేసిన నటి ప్రగతి.. సోషల్ మీడియాలో రచ్చ మాములుగా లేదుగా..
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజులో గంటలు గంటలు ఇంటర్నెట్ ప్రపంచంలో

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజులో గంటలు గంటలు ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగిపోతున్నారు యువత. మరీ ముఖ్యంగా ఇన్స్టా రీల్స్ అంటూ ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తున్నారు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు సైతం ఇంటర్నెట్ వాడకాన్ని పెంచేశారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో టచ్లో ఉంటున్నారు. తమ లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డే్ట్స్ మాత్రమే కాకుండా.. అప్పుడప్పుడు లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇక ఇప్పుడున్న టాలీవుడ్ క్యారెక్టర్ ఆరిస్టులకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో నటి ప్రగతి నెట్టింట్లో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన డాన్స్ వీడియోలు.. వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో నటి ప్రగతి చేసే రచ్చ గురించి తెలిసిందే.
తాజాగా నటి ప్రగతి నాగిని పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో నాగిని పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసింది ప్రగతి. వీడియోను తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. తాను చేసే ప్రతి పనిలో సంతోషాన్ని వెతుక్కుంటాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రగతి.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
View this post on Instagram
నటి ప్రగతికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం.. అలాగే ఫిట్ నెస్ మీది సరైన శ్రద్ద చూపడం వంటివి ఇష్టమని పలు సందర్భాల్లో ప్రగతి చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ గురించి తెలియజేస్తూ మహిళల్లో స్పూర్తి నింపుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది ప్రగతి.
Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..
Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..