సౌత్ టూ నార్త్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ ప్రభుదేవా. ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరు సంపాదించుకున్న ఆయన.. గత కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. వ్యక్తగతం జీవితంలోని కొన్ని వివాదాలతో అప్పట్లో వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. మొదటి భార్యతో గొడవలు.. విడాకులు.. ఆ తర్వాత నయనతార ప్రేమ, పెళ్లి వరకు రావడం.. చివరి నిమిషంలో విడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనమే అయ్యింది. ప్రభుదేవా జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవి పెద్ద చేదు సంఘటనలుగా మిగిలాయి. వ్యక్తిగత కారణాలతో దఆయన సినిమాలపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయారు. నయనతారతో పెళ్లి ఆగిపోయిన తర్వాత 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన హిమానీ సింగ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ ఎక్కువగా బయట కనిపించలేదు. తాజాగా వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తన భార్య హిమానీ సింగ్తో తిరుమలలో కనిపించారు. తన భార్య చేయి పట్టుకుని ప్రభుదేవా నడుస్తున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ప్రభుదేవా తనను చాలా ప్రేమగా చూసుకుంటారని చెప్పడం తెలుస్తోంది. ప్రభుదేవా రెండో భార్య హిమానీ ఎక్కువగా బయట కనిపించరు. అంతేకాదు.. ఆమె సోషల్ మీడియాలోనూ ఉండరు.
ఇదిలా ఉంటే ప్రభుదేవా చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. గతంలో పలు ప్రాజెక్ట్స్ ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అవేవి సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రభుదేవా, హిమానీ సింగ్ పెళ్లి విషయం ముందుగా బయటపెట్టింది ఆయన సోదరుడు రాజు సుందరం.
Prabhudeva & his wife Dr Himani. pic.twitter.com/JdXvI03Yys
— Christopher Kanagaraj (@Chrissuccess) April 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.