Prabhas: రీరిలీజ్ కాబోతున్న ప్రభాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా.. యోగి సినిమా మరోసారి..
ప్రస్తుతం చేతి నిండా భారీ బడ్జెట్ చిత్రాలతో ఉన్నారు ప్రభాస్. మరోవైపు ఈ హీరో సినిమాలు రీరిలీజ్ అవుతు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. తాజాగా మరో చిత్రం రీరిలీజ్ అయ్యిందుకు సిద్దమవుతుంది. అదే యాక్షన్ ఎమోషనల్ డ్రామా యోగి.

ప్రభాస్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. డార్లింగ్ మూవీస్ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ వెయిట్ చేస్తుంటారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటివరకు ఈ హీరో నటించిన సినిమాలన్ని భారీ ఓపెనింగ్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం చేతి నిండా భారీ బడ్జెట్ చిత్రాలతో ఉన్నారు ప్రభాస్. మరోవైపు ఈ హీరో సినిమాలు రీరిలీజ్ అవుతు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. తాజాగా మరో చిత్రం రీరిలీజ్ అయ్యిందుకు సిద్దమవుతుంది. అదే యాక్షన్ ఎమోషనల్ డ్రామా యోగి.
2007 జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలవుతోంది. ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘జోగి’కి రీమేక్ గా తెరెక్కించారు.. కన్నడలో శివరాజ్ కుమార్ చేసిన మ్యాజిక్ ని ప్రభాస్ తెలుగులో రీక్రియేట్ చేయాలనుకున్నాడు. కానీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇప్పుడు అదే సినిమా మళ్లీ విడుదలవుతోంది. అప్పుడు ఫ్లాప్ అయిన ‘యోగి’ ఇప్పుడు కూడా హిట్ అవుతుందా అని తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఉంది.
‘యోగి’ సినిమా ఏకంగా 250కి పైగా థియేటర్లలో విడుదలై దాదాపు 13 కోట్లు వసూలు చేసింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నష్టాలను చవిచూసింది. ఆ తర్వాత ‘యోగి’ సినిమా మలయాళం, హిందీ, తమిళ భాషల్లో డబ్ చేసినా అది కూడా ఫ్లాప్ అయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
