‘Salaar’ movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్.. తర్వాత సలార్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సడన్ గా రిలీజ్ చేసి అభిమానులను థ్రిల్ చేసాడు ప్రశాంత్.
ఇక ఈ సినిమా షూటింగ్ ను పరుగులు పెటించనున్నారట. సలార్ కోసం ఏకంగా 100మంది నూతన నటీనటులను తీసుకోనున్నారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం కలిపిస్తున్నామని హైదరాబాద్ చెన్నై ప్రాంతాల్లో మేకర్స్ ఆడిషన్స్ నిర్వహించారు. దీంతో భారీగా అప్లికేషన్లు వచ్చిపడ్డాయి. వారందరినీ టెస్ట్ చేసి అందులోంచి ఏకంగా 100 మంది కొత్త నటులను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ని ఢీ కొట్టేందుకు విలన్‌గా ఎవరిని రంగంలోకి దించాలని ప్లాన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కన్నడ స్టార్ మధు గురుస్వామిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామగుండంలో ప్రారంభించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Mahesh New Movie Update: త్వరలో గోవాకు పయనం కానున్న సర్కారు వారి పాట చిత్ర యూనిట్