Kalki 2898 AD: ప్రభాస్ క్రేజ్ అంటే ఇది.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న కల్కి.. ఆ రికార్డ్ డార్లింగ్‏కే సొంతం..

ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉగ్రరూపం దాల్చుతోందనే చెప్పాలి. మొదటి రోజే రూ. 191.5 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇటు ఐదు రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలాగే అదే స్థాయిలోనూ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు వారం రోజులు కాకుండానే రూ.500 కోట్లను క్రాస్ చేసింది కల్కి.

Kalki 2898 AD: ప్రభాస్ క్రేజ్ అంటే ఇది.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న కల్కి.. ఆ రికార్డ్ డార్లింగ్‏కే సొంతం..
Prabhas Kalki 2898 Ad Movie
Follow us

|

Updated on: Jul 02, 2024 | 5:26 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అద్భుతమైన విజువల్ వండర్ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది కల్కి. భారతీయ పురాణాలకు, సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, కమల్, దీపికా, విజయ్ దేవరకొండ యాక్టింగ్ మరో హైలెట్ అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉగ్రరూపం దాల్చుతోందనే చెప్పాలి. మొదటి రోజే రూ. 191.5 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇటు ఐదు రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అలాగే అదే స్థాయిలోనూ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు వారం రోజులు కాకుండానే రూ.500 కోట్లను క్రాస్ చేసింది కల్కి.

సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ప్రకారం సోమవారం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి రూ.600 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.625 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియాలో రూ.343.6 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అలాగే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.182 కోట్లు రాబట్టినట్లు సమాచారం. Sacnilk ప్రకారం నార్త్ ఇండస్ట్రీలో రూ.128 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ప్రాంతాలలో ఈ సినిమా జోరు కొనసాగుతుంది.

అలాగే కల్కి మరో ఘనతను సాధించింది. ఉత్తర అమెరికాలో 12 మిలియన్స్ డాలర్లు వసూళ్లను అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ నమోదు చేసిన భారతీయ సినిమాగా కల్కి నిలిచింది. ఇక ఇదే జోరు కొనసాగితే త్వరలోనే కల్కి రూ.1000 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారాంతంలో కల్కి రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయంగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.