Raja Saab : రాజాసాబ్‌ సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి..

పాన్ ఇండియ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ మూవీ రాజా సాబ్. మరికొన్ని గంటల్లో అడియన్స్ ముందుకు రానుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Raja Saab : రాజాసాబ్‌ సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి..
Raja Saab

Updated on: Jan 09, 2026 | 12:41 PM

సంక్రాంతి పండక్కి మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 9న విడుదల కానుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే జనవరి 8న అంటే ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షోలకు సైతం ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో ప్రీమియర్‌ షో టికెట్‌ ధర రూ.1000గా నిర్ణయించింది. దాదాపు 10 రోజులపాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని.. ఒక్కో టికెట్ పై సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్‌ ధర రూ.150.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.200 పెంచుకోవడానికి అంగీకరిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో ప్రీమియర్ షో వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఓజీ సినిమా తర్వాత ఈ స్థాయిలో టికెట్ ధరలు పెరిగిన సినిమా ఇదే కావడం గమనార్హం. అటు తెలంగాణలోనూ ఈ మూవీ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోనున్నారు ప్రభాస్.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..