
ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9న గ్రాండ్ గా విడుదలైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సరికొత్త హరర్ కామెడీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అక్కడక్కడ మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ థియేటర్లలో ప్రారంభరోజునే సునామీ సృష్టిస్తుంది. అంతేకాదు.. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా మొదటి రోజునే రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమాను వెనక్కు నెట్టింది. అలాగే సలార్, కల్కి చిత్రాలకు సైతం బ్రేక్ చేసింది.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
నివేదికల ప్రకారం ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్లకు పైగా వసూల్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో కలిపి ఈ సినిమా మొత్తం కలెక్షన్లు ఇప్పుడు రూ. 54.15 కోట్లకు పైగా ఉన్నట్లు టాక్. ఈ కలెక్షన్లు ప్రభాస్ బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. దీంతో మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలిచారు ప్రభాస్.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ప్రభాస్ హర్రర్ కామెడీ ది రాజా సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించి, రచించాడు మారుతి. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బోమన్ ఇరానీ మరియు జరీనా వాహబ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఎప్పటిలాగే ఇందులో వింటేజ్ ప్రభాస్ కామెడీ, లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..