Shraddha kapoor: సముద్ర గర్భంలో అందాల తార.. ఆకట్టుకుంటోన్న శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో..

|

Mar 23, 2021 | 9:20 AM

Shraddha kapoor: బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి శ్రద్ధా కపూర్‌. పేరుకు తండ్రి వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును..

Shraddha kapoor: సముద్ర గర్భంలో అందాల తార.. ఆకట్టుకుంటోన్న శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో..
Shraddha
Follow us on

Shraddha kapoor: బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి శ్రద్ధా కపూర్‌. పేరుకు తండ్రి వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుందీ చిన్నది. 2010లో ‘తీన్‌పత్తి’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
అనతి కాలంలో బాలీవుడ్‌లో ప్రముఖ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ‘ఆషికీ-2’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది భారీగా అభిమానులను సంపాదించుకుంది. ఇక తెలుగులో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం మెస్మరైజ్‌ చేసింది. ఇక సినిమాలతో నిత్యం బిజీగా గడిపే చిన్నది సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాల వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం శ్రద్ధాకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇటీవల శ్రద్ధా తన తల్లిదండ్రులతో కలిసి మాల్దీవులకు ట్రిప్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ అడ్వెంచర్‌ గేమ్‌ స్కూబా డైవింగ్‌ చేసిందీ అమ్మడు. సముద్ర గర్భంలో జలరాశులతో పోటీ పడుతూ స్విమ్‌ చేసిందీ చిన్నది. ఇక నీటిలో ఈత కొడుతోన్న శ్రద్ధాను చూస్తుంటే జలకన్యలా కనిపిస్తోంది. ఇక ఈ వీడియోతోపాటు ‘సముద్ర గర్భంలో జీవితం’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. మరి శ్రద్ధా స్కూబా డైవింగ్‌కు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. ఇక శ్రద్ధా కపూర్‌ సినిమాల విషయానికొస్తే.. ముద్దుగుమ్మ చివరిగా స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ, బాఘి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read: నటుడిగా మారిన ఏఆర్ రెహమాన్.. ఆ సూపర్ స్టార్ సినిమాలో కీలక పాత్రలో మ్యూజిక్ డైరెక్టర్..

పూరీ జగన్నాథ్ న్యూమూవీ అప్‏డేట్.. ఈసారి కన్నడ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్..

త్రివిక్రమ్ గారి వల్లే ‘వకీల్ సాబ్’ ఛాన్స్.. కానీ ఆ సినిమా మిస్ అయ్యాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్..