AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: కల్కి, స్పిరిట్, సలార్ 2 చిత్రాలు ఎలా ఉంటాయో చెప్పిన ప్రభాస్.. అంచనాలను పెంచేసిన డార్లింగ్..

ఎన్నాళ్లుగానో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రెబల్ స్టార్ అభిమానులకు అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు నీల్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నీల్ తెరకెక్కించిన సలార్ చిత్రంలోనే దేవా పాత్ర ప్రభాస్ కెరీర్‏లోనే మైలురాయి ప్రదర్శనలలో ఒకటి. దీంతో ఇప్పుడు డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ప్రభాస్.

Prabhas: కల్కి, స్పిరిట్, సలార్ 2 చిత్రాలు ఎలా ఉంటాయో చెప్పిన ప్రభాస్.. అంచనాలను పెంచేసిన డార్లింగ్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jan 04, 2024 | 9:47 AM

Share

సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. మొదటి రోజే రికార్డ్స్ బ్రేక్ కలెక్షన్స్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతారంలో అదరగొట్టేశాడు ప్రభాస్. ఎన్నాళ్లుగానో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రెబల్ స్టార్ అభిమానులకు అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు నీల్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నీల్ తెరకెక్కించిన సలార్ చిత్రంలోనే దేవా పాత్ర ప్రభాస్ కెరీర్‏లోనే మైలురాయి ప్రదర్శనలలో ఒకటి. దీంతో ఇప్పుడు డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ప్రభాస్.

ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను ఎంచుకునే సినిమాలు.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను అలరించడమే తన ఏకైక లక్ష్యం అని అన్నారు. విభిన్న పాత్రలను, భిన్నమైన కంటెంట్ ప్రయత్నించడానికి కారణం అభిమానులకు వినోదాన్ని అందించడమే అని అన్నారు. అలాగే ఇప్పుడు తాను చేస్తోన్న ప్రతి సినిమా ఏఏ జానర్ అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవలే విడుదలైన సలార్ సినిమా భారీ యాక్షన్ డ్రామా అయితే.. కల్కి 2898 AD భవిష్యత్ వైజ్ఞానిక కల్పనగా ఉంటుందని.. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా చాలా వరకు ఆకట్టుకునే కథ అని.. అలాగే ప్రస్తుతం తాను హారర్ చిత్రంలో నటిస్తున్నానని అన్నారు. దీంతో మారుతి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమా హారర్ కథ అని హింట్ ఇచ్చేశాడు డార్లింగ్. దీంతో ప్రభాస్ రాబోయే సినిమాలపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, శ్రియా రెడ్డి, జగపతి బాబు, బాబీ సింహా కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఎక్కువభాగం కల్పిత నగరం ఖాన్సార్ లో జరుగుతుంది. పరిస్థితుల కారణంగా శత్రువులుగా మారే ఇద్దరు ప్రాణ స్నేహితుల కథే సలార్. ఈ సినిమా సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం 2025లో థియేటర్లలోకి రానుంది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!