Mathu Vadalara 2 Trailer : ‘మత్తు వదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సత్య, శ్రీసింహ..

|

Sep 08, 2024 | 3:26 PM

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రితేష్ రానా దర్శకత్వం వహించగా.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో శ్రీసింహ హీరోగా నటిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా.. సత్య కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Mathu Vadalara 2 Trailer : మత్తు వదలరా 2 ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సత్య, శ్రీసింహ..
Mathu Vadalara 2 Trailer
Follow us on

2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ చిన్న కొడుకు శ్రీసింహ కోడూరి హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చిన శ్రీసింహకు ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. ఇప్పుడు మరోసారి మత్తు వదలరా సినిమా సీక్వెల్‏తో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రితేష్ రానా దర్శకత్వం వహించగా.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో శ్రీసింహ హీరోగా నటిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా.. సత్య కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సెప్టెంబర్ 13న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మత్తు వదలరా 2 ట్రైలర్ ను ఈరోజు ఉదయం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే శ్రీసింహ, సత్య తమదైన కామెడీతో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్ట్. మొత్తం 2 గంటల 19 నిమిషాల పాటు ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లను మత్తు వదలరా 2 టీమ్ విభిన్నంగా చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్టులతో వీడియోలు చేస్తుంది. అలాగే ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ ను హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రచించి స్వయంగా పాడింది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.