Raja Saab: ఆ పని చేస్తే కఠిన చర్యలే.. రాజా సాబ్ మూవీ టీం వార్నింగ్.. ఏం జరిగిందంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా తర్వాత చేతినిండా సినిమాలతో బిజీ అయ్యారు ప్రభాస్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, హను రాఘవపూడి డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు మరిన్ని సినిమాలు త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.

Raja Saab: ఆ పని చేస్తే కఠిన చర్యలే.. రాజా సాబ్ మూవీ టీం వార్నింగ్.. ఏం జరిగిందంటే..
Rajasaab Movie

Updated on: Jun 13, 2025 | 4:27 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు హారర్ కామెడీ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. అదే రాజా సాబ్. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో డార్లింగ్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా టీజర్ జూన్ 16న రిలీజ్ కానుందని సమాచారం.

డిసెంబర్ 5న రాజాసాబ్ సినిమాను విడుదల కానున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక జూన్ 16న ఈ మూవీ టీజర్ సైతం రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో కొన్నిరోజులుగా ఈ సినిమా టీజర్ గురించి, ఫోటోస్ నెట్టింట లీక్ అవుతున్నాయి. దీంతో లీక్స్ పై రాజాసాబ్ టీమ్ సీరియస్ అయ్యింది. లీక్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

“రాజాసాబ్ సినిమా నుంచి ఏదైనా లీక్ అయిన కంటెంట్ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటాము.. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ వెంటనే నిలిపివేస్తాం. ఇలాంటి లీకులను ఎంకరేజ్ చేయకండి. అందరూ మాకు సహకరించండి. మాతో నిలబడాలని మేము కోరుకుంటున్నాము. బాధ్యతాయుతంగా ఉందాం ” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజాసాబ్ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..