చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు హీరో మంచు విష్ణు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ మూవీని ఆగస్ట్ 18న శ్రీకాలహస్తిలో మోహన్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు నిర్మి్స్తుండగా.. మహాభారతం సీరియల్ కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ ఫేమస్ నటీనటులు కీలకపాత్రలలో నటించనున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతిసన్ సోదరి నుపుర్ సనన్ కథానాయికగా నటించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటించనున్నారని తెలుస్తోంది. ఇక ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించారు. ‘హర హర మహాదేవ్’ అంటూ రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. దీంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారని అంటున్నారు.
❤️ Har Har Mahadev ❤️ #Kannappa 🔥 https://t.co/GXbSbayFrX
— Vishnu Manchu (@iVishnuManchu) September 10, 2023
బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు భక్త కన్నప్ప సినిమాలో శివుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.