Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ పాన్ ఇండియా సినిమాకు నో రెమ్యునరేషన్.. అసలు విషయం ఇదే..
అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతోపాటు అటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఇవే కాకుండా ఈ ఏడాది చివర్లో ప్రభాస్ నటించాల్సిన మరిన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ కానున్నాయి. అటు సలార్ 2, స్పిరిట్ చిత్రాలతోపాటు మరిన్ని ప్రేమకథ చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలాకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరగా సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతోపాటు అటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఇవే కాకుండా ఈ ఏడాది చివర్లో ప్రభాస్ నటించాల్సిన మరిన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ కానున్నాయి. అటు సలార్ 2, స్పిరిట్ చిత్రాలతోపాటు మరిన్ని ప్రేమకథ చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ప్రభాస్ కన్నప్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే ప్రభాస్ ఈ మూవీ చిత్రీకరణ సెట్ లో అడుగుపెట్టినట్లు హీరో మంచు విష్ణు అధికారికంగా వెల్లడించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ పోస్టర్ చూస్తుంటే ప్రభాస్ నిజంగానే ఇందులో శివుడి పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పరశురాముడి పాత్రను పోషిస్తున్నారట. ఇక ఆ పాత్రలో కనిపించేందుకు ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం.. అలాగే పాత్ర నచ్చడంతో ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని టాక్. త్వరలోనే ఈ మూవీలో ప్రభాస్ పోషించే పాత్ర గురించి క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.