Mehreen Pirzada : నాకు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే ఊరుకోను.. వారిపై హీరోయిన్ సీరియస్..
కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ వీరి బంధం పెళ్లికి ముందే ముక్కలయ్యింది. తమ పెళ్లి రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన మెహ్రీన్ ఎఫ్ 3 మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.
మెహ్రీన్ ఫిర్జాదా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. కానీ తెలుగులో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించినా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్రలలో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ వీరి బంధం పెళ్లికి ముందే ముక్కలయ్యింది. తమ పెళ్లి రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన మెహ్రీన్ ఎఫ్ 3 మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేసిన మెహ్రీన్.. ఇటీవలే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటున్నట్లు ఓ పోస్ట్ చేసింది. గత రెండేళ్లుగా ఈ పద్దతి కోసం ప్రయత్నిస్తున్నానని.. చివరకు ఇప్పుడు కంప్లీట్ అయ్యిందంటూ చెప్పుకొచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉందని.. ప్రపంచంలో చాలా మంది మహిళలకు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్దతి గురించి అవగాహన కల్పించేందుకు తన వీడియోను పోస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే మెహ్రీన్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చిందంటూ ప్రచారం నడిచింది. తాజాగా ఆ వార్తలపై స్పందించింది మెహ్రీన్.
కొన్ని మీడియా సైట్స్ రాసిన వార్తలపై సీరియస్ అయ్యింది. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పి.. తన గురించి రాసిన వార్తలను డెలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ప్రస్తుతం మెహ్రీన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. “కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసేవారు వారి వృత్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అర్థం చేసిన వార్తలు ప్రచురించండి.. కానీ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడం అనైతికమే కాదు.. చట్ట విరుద్ధం కూడా. ఇటీవల నేను పోస్ట్ చేసిన ఫ్రీజింగ్ ఎగ్స్ పోస్ట్ పై చాలా మంది అనేక రకాలుగా వార్తలు రాస్తున్నార. నేను ధైర్యం చేసి ఈ విషయం గురించి మాట్లాడాను. ఎగ్ ఫ్రీజింగ్ కోసం అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. బాధ్యయుతమైన సెలబ్రెటీగా మహిళలకు అవగాహన కల్పించడం కోసమే ఆ పోస్ట్ పెట్టాను. పిల్లలను అప్పుడే వద్దు అని భావంచే తల్లిదండ్రులకు ఎగ్ ఫ్రీజింగ్ పద్దతి ఉపయోగపడుతుంది. కానీ ఇదేం అర్థం కాకుండా మీ ఇష్టానుసారంగా నేను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాశారు. నా గురించి పెట్టిన పోస్టులు డెలీట్ చేయండి. అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది.
Dear Media,
It is high time few reporters need to respect their job and understand what responsibility social media and the Press holds towards the society.
Just to sell a news with fake and incorrect information is not only immoral but illegal too. For ‘Freezing eggs’ a girl…
— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) May 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.