Prabhas: డార్లింగ్ దూకుడు.. జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుంటున్న మారుతి మూవీ

|

Jan 19, 2023 | 8:16 AM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

Prabhas: డార్లింగ్ దూకుడు.. జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుంటున్న మారుతి మూవీ
Prabhas, Maruthi
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించడానికి రెడీ అయ్యాడు. భారీ సినిమాలను లైనప్ చేస్తూ దూకుడు మీద ఉన్నారు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాకేజ్ట్ కే, మారుతితో కలిసి రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

మారుతి ప్రభాస్ సినిమా హారర్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తికాగా త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది.  ప్రభాస్ లేకుండగా మరో షెడ్యూల్ షూటింగును జరిపినట్టుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు మూడో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి మొదలెట్టనున్నారని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగకి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.