పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు ఓ సంచలనం సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న సలార్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు.. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌లో యష్‌ను ఓ రేంజ్‌లో చూపించిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను ఎలా చూపించనున్నాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 85 శాతం పూర్తి చేసుకుంది. ఇటీవలే ‘2023 ఏడాది కాదు సలార్’ (2023 సాల్ నహి, సలార్ హై) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే సలార్ సినిమాకు లీకుల బెడద తప్పడంలేదు.
ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైన విషయం తెలిసిందే.. తాజాగా మరి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతోన్న లీక్డ్ ఫొటోస్ లో ప్రభాస్ సూపర్ గా ఉన్నారు.
ఇక ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో చిత్రయూనిట్ అప్రమత్తం అయ్యిందని తెలుస్తోంది. షూటింగ్ ఫోటోలు వీడియోలు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇక ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
Salaar