Prabhas: కన్నప్ప సెట్‏లో అడుగుపెట్టిన ప్రభాస్.. శివుడిగా డార్లింగ్ ఫోటో షేర్ చేసిన విష్ణు..

|

May 09, 2024 | 5:30 PM

మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

Prabhas: కన్నప్ప సెట్‏లో అడుగుపెట్టిన ప్రభాస్.. శివుడిగా డార్లింగ్ ఫోటో షేర్ చేసిన విష్ణు..
Prabhas, Vishnu
Follow us on

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ప్రతి క్షణం దగ్గరుండి చూసుకుంటున్నారు మంచు మోహన్ బాబు. అలాగే ఆయన నిర్మాతగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ సెట్ లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రభాస్ పాత్రకు సంబంధించిన పోస్టర్ షేర్ చేశారు. ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో శివుడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కాలు అడుగుపెడుతున్నట్లు ఉన్న పోస్టర్ షేర్ చేస్తూ నా బ్రదర్ షూట్ లో జాయిన్ అయ్యాడు అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కన్నప్ప చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా అటు సలార్ 2, స్పిరిట్ చిత్రాలు త్వరలో స్టార్ట్ కానున్నాయి. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో క్షణం తీరికలేకుండా ఉన్న ప్రభాస్.. ఇప్పుడు కన్నప్ప మూవీ కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.