Tollywood: వామ్మో.. ఈ అమ్మాయి ఆ స్టార్ హీరోయినా ..? మెగా హీరోలతో ఎక్కువగా నటించింది..
వరుసగా ప్లాపులు పలకరిస్తున్నా.. ఆఫర్స్ తగ్గడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే ఎక్కువగా మెగా హీరోలకు జత కట్టి తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ..? మొదట్లో టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో నెట్టింట పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మడు మరెవరో కాదండి..
సినిమా ప్రపంచంలో స్టార్ డమ్ అందుకోవాలంటే అందం, టాలెంట్ మాత్రమే కాదు.. కాస్త అదృష్టం కూడా ఉండాలి. కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటారు. దీంతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంటారు. కానీ ఈ అమ్మడు కొంచెం డిఫరెంట్. వరసుగా ప్లాపులు పలకరిస్తున్నా.. ఆఫర్స్ తగ్గడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే ఎక్కువగా మెగా హీరోలకు జత కట్టి తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ..? మొదట్లో టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో నెట్టింట పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మడు మరెవరో కాదండి.. హీరోయిన్ కేతిక శర్మ. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా ఈ అమ్మడుకు క్రేజ్ ఎక్కువగానే వచ్చింది. మొదటి సినిమాలోనే గ్లామర్ షో.. లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. ఆ తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగా వైభవంగా చిత్రంలో కనిపించింది. కానీ ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. చివరగా సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో చిత్రంలో కనిపించింది. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఇందులో హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేకపోవడంతో అసలు కేతికకు ఎలాంటి ఫేమ్ రాలేదు.
బ్రో తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ గ్లామర్ పిక్స్ అప్లోడ్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తుంది కేతిక. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. కేతిక శర్మ ఢిల్లీలో 1995 డిసెంబర్ 25న జన్మించింది. ప్రస్తుతం ఆ అమ్మాడి వయసు 28 సంవత్సరాలు. చదువు పూర్తికాగానే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.