Unstoppable with NBK : బాలయ్య షోకు మరో బడా‌ హీరో.. అన్ స్టాపబుల్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న స్టార్ హీరో..

ఇప్పుడు ఎక్కడ చుసిన జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలే వినిపిస్తున్నాయి.  ఏ థియేటర్ దగ్గర చుసిన అఖండ జాతరే కనిపిస్తుంది.

Unstoppable with NBK : బాలయ్య షోకు మరో బడా‌ హీరో.. అన్ స్టాపబుల్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న స్టార్ హీరో..
Nbk

Updated on: Dec 07, 2021 | 6:38 PM

Unstoppable with NBK : ఇప్పుడు ఎక్కడ చుసిన జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలే వినిపిస్తున్నాయి.  ఏ థియేటర్ దగ్గర చుసిన అఖండ జాతరే కనిపిస్తుంది. అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగు సినిమా థియేటర్స్ కు పూర్వ వైభవం వచ్చింది. ఇక అఖండ ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేస్తున్నాయి మిగిలిన సినిమాలు. ఇక అటు హీరోగా రాణిస్తూనే ఇప్పుడు హోస్ట్‌గా అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అదిరిపోయే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ అనే టైటిల్ తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఈ షోకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి హాజరయ్యి సందడి చేశారు. త్వరలోనే ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. మహేష్ ఎపిసోడ్ ను త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నారు.

అలాగే ఈ షోకు అఖండ టీమ్ కూడా హాజరయ్యి సందడి చేశారు. ఇక  ఇప్పుడు ఈ షోకు మరో స్టార్ హీరో రాబోతున్నాడని టాక్ నడుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్. ప్రభాస్ త్వరలో బాలకృష్ణ షోకు గెస్ట్ గా రానున్నాడన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇటీవల పలు సినిమాల ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య షోకు కూడా ప్రభాస్ హాజరు కానున్నాడని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ప్రభాస్ వరుస ఆసినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్ కోసం అటు డార్లింగ్ అభిమానులతోపాటు.. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..

Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..