పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం మహాకావ్యం ఆధారంగా రూపొందిన ఈ మైథలాజికల్ మూవీలో రాముడిగా కనిపించనున్నారు. జానకి పాత్రలో కృతిసనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆదిపురుష్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ మరి కొన్ని గంటల్లో తీరనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగతంగానూ ప్రభాస్ అంటే చాలామందికి ఇష్టం. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభిమానులకు ఎంతో ప్రాధాన్యమిచ్చే డార్లింగ్ తన అవసరం ఉన్నప్పుడు తప్పక సాయ పడుతుంటారు. ఇక సినిమా సభ్యులకు ఇంటి భోజనం తెప్పించడం, బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తూ తన మంచి మనును చాటుకున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగిశాక చిత్రబృందంలోని వారందరికీ ఓ ప్రముఖ కంపెనీ వాచీలు కానుకగా ఇచ్చారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రభాస్.
డార్లింగ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా సలార్ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఈక్రమంలో సలార్ మూవీ కోసం పనిచేస్తున్న టీం సభ్యులందరి ఖాతాలో రూ. 10 వేలు జమ చేశారట ప్రభాస్. పాన్ ఇండియా సినిమా కోసం యూనిట్ సభ్యులంతా రేయింబవళ్లు శ్రమించారని, అందుకు ప్రతిఫలంగానే తన వంతుగా ప్రభాస్ సాయం చేశాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా సర్కిళ్లలో తెగ వినిపిస్తోంది. ఈ విషయం తెలుగుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ‘మా డార్లింగ్ మనసు చాలా గొప్పది’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..