
భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ప్రభాస్. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. మరోవైపు డార్లింగ్ సినిమాల కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్, ఫౌజీ సినిమాల పై హైప్ నెలకొంది. మరోవైపు హీరోగా ప్రభాస్ తెరంగేట్రం చేసి 23 సంవత్సరాలు అవుతుంది. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ఈశ్వర్. 2002 నవంబర్ 11న విడుదలైంది. నటనలో శిక్షణ పూర్తి కాకుండానే ఈ సినిమా చేయాల్సి వచ్చింది. అసలు ఆ సినిమా ఎలా మొదలైంది.. ? అనే విషయాలను డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అప్పుడు ప్రియురాలిగా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్.. చిరుతో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
తాను మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా చేస్తున్న సమయంలోనే తనతో ఓ సినిమా చేస్తానని నిర్మాత అశోక్ కుమార్ కు మాటిచ్చారట జయంత్. ప్రేమకథలకు యాక్షన్ ఉంటే బాగుంటుందని ఆలోచించి ఈశ్వర్ సినిమా రాసుకున్నరాట. తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించాలని అనుకున్నామని.. ఈ కథకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు సరిపోడని భావించి.. మాస్ లుక్ ఉండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారట.
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..
అప్పుడే కృష్ణంరాజు సోదరుడి కుమారుడు యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని తెలియడంతో… ఫోటోస్ చూడగానే హీరో మెటీరియల్ అనుకుని.. ప్రభాస్ ను కలిశాడ. ట్రైనింగ్ పూర్తికాలేదు.. ఇంకా కొంత సమయం కావాలని ప్రభాస్ అడగ్గా.. ట్రైనింగ్ అక్కర్లేదు..నువ్వు నటిస్తావు అని చెప్పి సినిమా స్టా్ర్ట్ చేశారట. అలా ఈశ్వర్ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాను కేవలం 1 కోటి రూపాయాలతోనే నిర్మించారు. కానీ అప్పట్లోనే రూ.3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తొలి చిత్రానికి ప్రభాస్ దాదాపు 4 లక్షలు పారితోషికం తీసుకున్నారట. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు.
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..