AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. డార్లింగ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. పోస్టర్ అదిరిపోయిందిగా..

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ అదిరిపోయింది. ఇంతకీ థియేటర్లలోకి ఫౌజీ ఎప్పుడు వస్తున్నాడో తెలుసా.. ? ఈ చిత్రానికి డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. డార్లింగ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. పోస్టర్ అదిరిపోయిందిగా..
Fauzi
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 16, 2026 | 12:05 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు వచ్చేసింది. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు లాక్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట మొదలుపెట్టేందుకు డిసెంబర్ 3న ఈ గ్రాండ్ మూవీ థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న డార్లింగ్.. ఈసారి డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలపడంతో ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. ‘సీతా రామం’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన డైరెక్టర్ హను రాఘవపూడి, ఈసారి అంతకుమించిన భారీ కాన్వాస్‌ను ఎంచుకున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన యాక్షన్ పీరియడ్ లవ్ స్టోరీగా ‘ఫౌజీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హను మార్క్ వింటేజ్ రొమాన్స్‌కు ప్రభాస్ కటౌట్, హై-వోల్టేజ్ యాక్షన్ తోడైతే వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథ కాబట్టి, ఇందులో యాక్షన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ పక్కన ఒక సరికొత్త ముఖాన్ని చూడబోతుండటంతో ఈ పెయిరింగ్‌పై ఇండస్ట్రీలో మంచి క్యూరియాసిటీ నెలకొంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్, యాక్షన్ సీక్వెన్సుల కోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి కాలమానాన్ని కళ్లకు కట్టేలా భారీ సెట్లు నిర్మించి, సినిమాను ఒక విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం.. ప్రభాస్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఒకవైపు కటౌట్‌కు తగ్గ యాక్షన్, మరోవైపు మనసుకు హత్తుకునే సున్నితమైన ప్రేమకథ సమానంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ఫౌజీ’ సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీ కోసం ఇటు రెబల్ స్టార్ అభిమానులతో పాటు అటు కామన్ ఆడియన్స్ కూడా క్యాలెండర్‌లో డేట్ మార్క్ చేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఫౌజీ రిలీజ్ డేట్..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆ రోజు విధ్వంసమేనా..?
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆ రోజు విధ్వంసమేనా..?
నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..
నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..
తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.
తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.
ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..
ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప
మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప
అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే
అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే
ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్
ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్
భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్
భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్
సేవింగ్స్ అకౌంట్లో అంతకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే జైలుకే..
సేవింగ్స్ అకౌంట్లో అంతకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే జైలుకే..