పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన లాంటి స్టార్స్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. జూన్ 27న థియేటర్లలోకి అడుగు పెట్టిన కల్కి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇలా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు డార్లింగ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
‘నా అభిమానులందరికీ నమస్కారం.. ఇంత పెద్ద హిట్ అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. మాది దాదాపు ఐదేళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను నాకు అందించినందుకు వైజయంతి మూవీస్, నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. అశ్వినీదత్ ఎంతో ధైర్యమున్న నిర్మాత. ఆయన ఖర్చుపెట్టిన దాన్ని చూసి నేను చాలా కంగారుపడ్డాను. మీరు చాలా ఖర్చు చేస్తున్నారు సార్ అని అశ్వినీదత్‌కి చెప్పాను. వద్దు.. వద్దు.. పెద్ద హిట్ ఇస్తాం, కంగారుపడకండి, బెస్ట్ క్వాలిటీ సినిమా తీయాలి అని ఆయన బదులిచ్చారు. స్వప్న, ప్రియాంకలకు కూడా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే దీపికా, కమల్ సార్, అమితాబ్ సార్, దిశా పటానీకి మనస్ఫూర్తిగా నా అభినందనలు’ అంటూ పోస్ట్ చేశారు.
A sweet note from our Bhairava, Karna a.k.a #Prabhas, as we celebrate the blockbuster success of #Kalki2898AD ❤️
– https://t.co/MjXlFOCk12#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/yo5COEoLKc
— Kalki 2898 AD (@Kalki2898AD) July 14, 2024
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్‌లో ది రాజాసాబ్‌లో కనిపించనున్నారు.
The name is KARNA 🚩
Epic Maha Blockbuster #Kalki2898AD running successfully in cinemas near you!
– https://t.co/fUQMHgijPK#1000CroreKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/vWjKRwKvNO
— Kalki 2898 AD (@Kalki2898AD) July 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.