ఆ హీరోయిన్‌కు పొగరెక్కువ.. స్టార్ హీరోను కూడా లెక్కచేయలేదు.. ప్రభాస్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

|

Jan 11, 2025 | 5:44 PM

డైరెక్టర్ మారుతి ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించి మెప్పించారు. ఈరోజుల్లో సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి పేరు మారుమోగింది. ఆ తర్వాత బస్ స్టాప్, ప్రేమకథ వంటి చిత్రాలతో మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. చిన్న చిన్న సినిమాలతోనే భారీ విజయాలను అందుకున్న మారుతి.. న్యాచురల్ స్టార్ నానితో భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి వసూళ్లు రాబట్టారు.

ఆ హీరోయిన్‌కు పొగరెక్కువ.. స్టార్ హీరోను కూడా లెక్కచేయలేదు.. ప్రభాస్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Maruti
Follow us on

స్టార్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చిన్న సినిమాలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు మారుతి. 2012లో ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మారుతి. ఈ సినిమా కు నిర్మాతగానూ వ్యవహరించాడు మారుతి. ఆతర్వాత వరుసగా బస్ స్టాప్,కొత్త జంట,భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు, ప్రతి రోజు పండగే,మాంచి రోజులొచ్చాయ్, పక్కా కమర్షియల్ సినిమాలు చేశాడు.వీటిలో భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో భారీ హిట్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మారుతి.

ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు

హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే మారుతి ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఓ స్టార్ హీరోయిన్ కు గర్వం ఎక్కువ అని అన్నారు మారుతి. అంతే కాదు సినిమా సెట్ లోనే ఆ హీరోయిన్ తో గొడవకూడా పెట్టుకున్నారట మారుతి. ఆ హీరోయిన్ ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.

ఇవి కూడా చదవండి

సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్

వెంకటేశ్ హీరోగా నయనతార హీరోయిన్ గా బాబుబంగారం అనే సినిమా  చేశారు మారుతి. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా సెట్ లో నయన్ ప్రవర్తించిన తీరు పై గతంలో మారుతి మాట్లాడారు. మారుతి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నయనతార బాబు బంగారం చిత్ర యూనిట్‌కు సహకరించేది కాదని అన్నారు. చిన్న దర్శకుడిని కాబట్టి నన్ను గౌరవించలేదు అయినా నాకు పర్లేదు కానీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోని కూడా ఆమె గౌరవించకుండా ప్రవర్తించింది. వెంకటేష్ ను ఆమె లెక్క చేసేది కాదు దాంతో నేను ఆమెతో గొడవ పెట్టుకున్నాను అని అన్నారు. మూవీ క్లైమాక్స్‌లో ఓ పాట చిత్రీకరించాల్సి ఉందని, కానీ నయనతారను ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె ఒప్పుకోలేదన్నారు. తాను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను అని చెప్పి షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఆ సాంగ్ లేకుండా సినిమాను రిలీజ్ చేశాం అని మారుతి తెలిపారు. వెంకటేష్ గారికి ఆమె గౌరవం ఇవ్వకపోవడం తనకు నచ్చలేదు అని మారుతి అన్నారు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి