Radhe Shyam: రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు.. మ్యూజికల్ టూర్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్ ప్రధాన పాత్రలో

Radhe Shyam: రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు.. మ్యూజికల్ టూర్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్..
Radheshyam

Updated on: Dec 29, 2021 | 2:51 PM

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వింటెజ్ ప్రేమకథ చిత్రంగా వస్తున్న ఈమూవీలో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ వెండితెరపై కనిపించబోతుండడంతో రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్‏ సినిమపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ కూడా ఒకటి.

ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా.. రాధేశ్యామ్ చిత్రయూనిట్.. తాజాగా రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్ ప్రారంభించింది. ఈ టూర్ ముందుగా వైజాగ్ నుంచి మొదలైంది. దీనికోసం చుట్టూ పోస్టర్స్‏తో ఉన్న ఒక వాహనాన్ని సిద్ధం చేశారు. ఇక ట్రైలర్ మాదిరిగానే దీనిని కూడా అభిమానులతో లాంచ్ చేయించారు మేకర్స్. ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రతి మేజర్ విషయాన్ని అభిమానులతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రభాస్ అండ్ టీం.

జనవరి 7 నుంచి ప్రభాస్‏తోపాటు రాధేశ్యామ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్‏లో భాగం కానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. దీనికోసం నేషనల్ మీడియాతో కూడా ప్రభాస్ మాట్లాడనున్నారు. భారీ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు రాధే శ్యామ్ టీం. దీనికి హీరో ప్రభాస్ కూడా తన 100% ఎఫర్ట్ పెడుతున్నారు. చిత్ర యూనిట్ కూడా ఇప్పటి నుంచి మీడియాకు ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కించారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మొదటి లవ్ స్టోరీ ఇది. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Also Read: Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Roja Selvamani: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్.. ఎమ్మెల్యే రోజా ఫైర్..

Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్