Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది పండుగ రోజు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్.. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..
Radhe Shyam

Updated on: Dec 23, 2021 | 10:01 PM

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది పండుగ రోజు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్.. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.’జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ వేడుకకు సుమారు 40 వేల మంది ఫ్యాన్స్ వరకు విచ్చేశారు.

ఇదిలా ఉంటే.. కాసేపటి క్రితం రాధేశ్యామ్ ట్రైలర్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. . ప్రపంచవ్యాప్తంగా దేశ నాయకులు కలవాలి అనుకునే పేరున్న హస్త సముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించబోతున్నారు. ప్రాణం పోసే ప్రేమ ప్రాణాలను తీయగలదా అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రభాస్ ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ట్రైలర్..

Also Read:Radhe Shyam Pre Release Event Live: ప్రీరిలీజ్ ఈవెంట్ వద్దకు చేరుకున్న ప్రభాస్, పూజా హెగ్డే.. రచ్చ చేస్తోన్న ఫ్యాన్స్..