పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులతోపాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనునున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ టీజర్ అయోధ్యలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ టీజర్ ప్రభాస్ ను రాముడి గెటప్ లో చూడాలన్న డార్లింగ్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. రాముడిగా ప్రభాస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కానీ గ్రాఫిక్స్ ఎక్కువగా వాడటంతో ఫ్యాన్స్ కస్సుబుస్సులులాడుతున్నారు. టీజర్ లో ప్రభాస్ లుక్ లో గ్రాఫిక్స్ మిక్స్ అయ్యి ఉండటంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఓ యానిమేషన్ మూవీలా అనిపించిందనే టాక్ ఎక్కువ గా వినిపించింది. అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే ఈ టీజర్ పై పలు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాపీ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలనుంచి కొన్ని సీన్స్ కాపీ చేశారని కొందరు నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.
‘థోర్, అవెంజర్స్ ఎండ్‌గేమ్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, కాంగ్ స్కల్ ఐలాండ్, ఆక్వామాన్, హౌజ్ ఆఫ్ ద డ్రాగన్, రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్.. సినిమాల నుండి కొన్ని సీన్లు కాపీ చేశారని అంటున్నారు . అంతే కాదు ఆ సినిమాలలోని సీన్స్ ను స్క్రీన్ షాట్స్ తీసి మరి కంపార్ చేస్తున్నారు. ముఖ్యంగా రావణుడు పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పక్షి పై వచ్చే సీన్ హౌజ్ ఆఫ్ ద డ్రాగన్ నుండి లేపారట. అలాగే వానరసేన ను ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ నుంచి, అలాగే కొన్ని కింగ్ కాంగ్ నుంచి లేపేశారని ఆరోపిస్తున్నారు.
Respect for @omraut sir increased.
Man is giving us flavours of so many many Hollywood films in just one film.#Adipurush pic.twitter.com/aaRXVQImNL
— Benevolent Autocratic (@SocioPatheticMe) October 4, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..