తిరుమల కొండపై ఇదో కొత్త వివాదం. నిన్నటి( జూన్ 6న)ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత వెళ్లిపోతుండగా ఓం రౌత్ ఈ చర్యకు పాల్పడ్డారు. కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆప్యాయంగా ఓ ముద్దుపెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. సినిమా వాళ్లకు, సెలబ్రిటీలకు ఈ తరహా ఆప్యాయతలు సహజమే అయినా.. కొండంత పవిత్రత ఉన్న వెంకటేశుడి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అతి అప్యాయతలు మాత్రం ముమ్మాటికీ తప్పే అంటోంది బీజేపీ.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అవ్వనుంది. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నివహించారు. తిరుపతిలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ ఈవెంట్ తర్వాత తిరుమలేశుడిని దర్శించుకున్నారు అయితే కొండ మీద ఓం రౌత్ కృతికి ముద్దు పెట్టడం ఇప్పుడు వివాదంగా మారింది.
ఇక ఇదే విషయంపై బీజేపీ అధికార ప్రతినిథి భాను ప్రకాష్ సీరియస్ అయ్యారు. స్వామివారి దర్శనానికి వచ్చి ఇవేం వెకిలి చేష్టలు అంటూ ఓంరౌత్‌ను ప్రశ్నించారు. కోట్లాది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం తప్పన్నారు. ఇది షూటింగ్ స్పాట్ కాదని.. పిక్‌నిక్ స్పాట్ అసలే కాదని.. గుర్తు పెట్టుకోవాలన్నారు. చేసిన తప్పుకు.. కృతి, ఓంరౌత్ బహిరంగంగా క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో.. వీరిద్దరిపై టీటీడీ చర్చలు తీసుకోవాలన్నారు.