Prabhas: ప్రభాస్ ముందు చేతులెత్తేసిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్

టీజర్‌ రికార్డ్స్‌లో ప్రభాస్‌ సినిమా షారూఖ్‌, హృతిక్ లాంటి బాలీవుడ్ టాప్‌ స్టార్స్‌కు కూడా షాక్ ఇచ్చింది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తొలి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌..

Prabhas: ప్రభాస్ ముందు చేతులెత్తేసిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్
Prabhas, Shahrukh Khan

Updated on: Nov 04, 2022 | 4:12 PM

టాక్‌తో సంబంధం లేకుండా ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర తన సత్తా చాటుతున్నారు పాన్ ఇండియా రెబల్  స్టార్ ప్రభాస్‌. బాలీవుడ్‌లో భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నా డార్లింగ్ రికార్డ్‌కు దగ్గరగా కూడా ఎవరు రాలేకపోతున్నారు. ముఖ్యంగా టీజర్‌ రికార్డ్స్‌లో ప్రభాస్‌ సినిమా షారూఖ్‌, హృతిక్ లాంటి బాలీవుడ్ టాప్‌ స్టార్స్‌కు కూడా షాక్ ఇచ్చింది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తొలి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ విజువల్‌ వండర్ మీద ఆడియన్స్‌తో పాటు ఇండిస్ట్రీ జనాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌ అభిమానులను నిరాశపరిచింది. కానీ నెగెటివ్ టాక్ వచ్చినా… రికార్డ్స్ పరంగా మాత్రం నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది ఆదిపురుష్‌.

ప్రభాస్ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ అయిన ఆదిపురుష్‌ టీజర్‌ జస్ట్ 18 మినిట్స్‌లోనే 200 కే లైక్స్ సాధించి ఆల్‌ టైమ్ రికార్డ్‌ సెట్ చేసింది. దీంతో ఈ రికార్డ్‌ విషయంలో బాలీవుడ్‌ మూవీస్‌ వెనకపడిపోవటంతో నార్త్ సినిమా సోషల్ మీడియా స్టామినా మీద అనుమానాలు మొదలయ్యాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన బాలీవుడ్ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ విక్రమ్ వేదా. సౌత్‌ బ్లాక్ బస్టర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇంత బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో 200 కే లైక్స్‌ సాధించడానికి గంట పదిహేను నిమిషాల సమయం పట్టింది.

తాజాగా కింగ్ ఖాన్ షారూక్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ టీజర్ రిలీజ్ అయ్యింది. దాదాపు నాలుగేళ్ల తరువాత బాద్‌ షా మూవీ నుంచి అప్‌డేట్‌ రావటంతో ఆల్‌ టైమ్ రికార్డ్ సెట్ చేసేందుకు ముందు నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు ఫ్యాన్స్‌. కానీ ఇంత ప్రిపేర్డ్‌గా ఉన్నా… ఆదిపురుష్ రికార్డ్‌ను మాత్రం టచ్‌ చేయలేకపోయింది పఠాన్‌. ప్రభాస్‌ 18 నిమిషాల్లో సాధించిన మార్క్‌ను రీచ్‌ అయ్యేందుకు షారూఖ్‌కు 53 నిమిషాల టైమ్ పట్టింది. దీంతో డార్లింగ్ రేంజ్‌ను రీచ్ అయ్యే బాలీవుడ్ స్టార్‌ ఈ జనరేషన్‌లో అయితే లేరంటున్నారు విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి..