పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్ లో బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో తొలిప్రేమ(Tholi Prema)ఒకటి పవర్ స్టార్ కెరీర్ బిగినింగ్ లో ఈ భారీ హిట్ ను అందుకున్నారు పవన్ కళ్యాణ్. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణాకరన్ తెరకెక్కించిన తొలిప్రేమ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈసినిమాలో పవన్ సరసన కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పవన్ నటన, ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ ఎవర్ గ్రీన్.. దీపావళి రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న హీరోయిన్ కీర్తిరెడ్డిని చూపించాడు దర్శకుడు కరుణాకరన్. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే రెప్ప వేయకుండా చూస్తుంటారు ప్రేక్షకులు.
తొలిప్రేమ సినిమా 21 సెంటర్లలో 100రోజులు, రెండు సెంటర్లలో 200రోజులు ఉత్సవాలు జరుపుకుంది. అలాగే ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్స్. ఇక నేటితో ఈ సినిమా 24 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1998 లో విడుదలైంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ నటించిన నాలుగో సినిమా ఇది. ఇక ఈ సినిమా 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. తొలిప్రేమ సినిమా వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.