Pushpa 2 The Rule : సుకుమార్ మామూలోడు కాదుగా.. ‘పుష్ప 2’ కోసం భారీ ప్లాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బన్ని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యరెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు

Pushpa 2 The Rule : సుకుమార్ మామూలోడు కాదుగా.. 'పుష్ప 2' కోసం భారీ ప్లాన్
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2022 | 5:09 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)నటించిన పుష్ప(Pushpa)సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యరెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ విడుదలై అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగాను పుష్ప రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు సుకుమార్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే పుష్ప 2 సినిమా పార్ట్ 1కు మించి ఉంటుందని తెలుస్తోంది.

పుష్ప సినిమాలో సునీల్ , ఫహద్ పాజిల్ విలన్స్ గా కనిపించారు. అయితే పార్ట్ 2లో తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 కు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 కోసం సుకుమార్ భారీ ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో విడుదల చేయాలని సుకుమార్ చూస్తున్నారట. పుష్ప 1 కు వచ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఈ మూవీని 10 భాషల్లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. పుష్ప సినిమా 5 భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 ను మరో ఐదు కలిపి 10 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఏ ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?