Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు. వకీల్ సాబ్ , భీమ్లానాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టిన పవన్..

Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..
Hari Hara Veera Mallu
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 26, 2022 | 12:25 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan )నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు. వకీల్ సాబ్ , భీమ్లానాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టిన పవన్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలన్న కసిమీద ఉన్నారు. పవర్ స్టార్ లైనప్ చేసిన సినిమాల్లో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. పవన్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. మొగలాయిలా కాలం నాటి కథతో రూపొందుతూన్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా హరిహర వీరమల్లు సెట్ నుంచి మరో ఫోటోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో పవర్ స్టార్ షాట్ అయిన తర్వాత మానిటర్ లో సన్నివేశం ఎలా వచ్చిందో అని చూస్తూ కనిపించారు. ఆ పక్కనే దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. హరిహరవీరమల్లు సినిమా కోసం మొగలాయిలా కాలం నాటి సెట్స్ ను భారీ స్థాయిలో వేశారు. అలా ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రస్తుతం షూటింగు చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ ను ఇవ్వనున్నారు దర్శకనిర్మాతలు. మరి ఈ సినిమాతో పవన్ ఏ స్థాయిలో హిట్ కొడతారో చూడాలి.

Pawan Kalyan

మరిన్ని ఇక్కడ చదవండి :

Raveena Tandon: స్ట‌న్నింగ్ పోజుల‌తో ర‌చ్చ చేస్తున్న రవీనా టాండన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Srinidhi Shetty: అందాలతో కవ్విస్తున్న కేజీయఫ్‌ భామ.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: ఆమె మాటలు గంగా ప్రవాహం.. ఆమె అందం యువకులను ఆకర్షించే మకరందం.. గుర్తించారా..?