Hari Hara Veera Mallu: 3 లుక్స్‌, 30 గెటప్స్‌… పవన్‌ కోసం బిగ్ ప్లాన్‌.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న క్రిష్

పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్‌ వైరల్ అవుతోంది. ఫోక్‌లోర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌.

Hari Hara Veera Mallu: 3 లుక్స్‌, 30 గెటప్స్‌... పవన్‌ కోసం బిగ్ ప్లాన్‌.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న క్రిష్
Pawan Kalyan

Updated on: May 26, 2021 | 2:36 PM

Hari Hara Veera Mallu: పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్‌ వైరల్ అవుతోంది. ఫోక్‌లోర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌… రాబిన్‌హుడ్ తరహా బందిపోటు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌ స్టార్‌ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారట. లుక్స్ విషయంలోనే కాదు కాస్ట్యూమ్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్‌ తీసుకుంటున్నారు మేకర్స్‌. పీరియాడిక్ ఫీల్ వచ్చేలా 30 వెరైటీ డ్రెసెస్‌ డిజైన్ చేయించారట. సినిమా మొత్తంలో పవన్‌ ఆ 30 కాస్ట్యూమ్స్‌లోనే కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టీజర్లో రిలీజ్ అయిన లుక్‌కు మంచి రెస్సాన్స్‌ వచ్చింది. మిగతా గెటప్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయన్న హింట్‌ ఇస్తున్నారు మేకర్స్‌ .

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్‌ వండర్‌ కోసం పవన్‌ కూడా చాలా కష్టపడుతున్నారు. కత్తి యుద్దం, కర్రసాములో ట్రైనింగ్‌ తీసుకున్నారు. వారియర్‌ తరహా ఫిజిక్‌ కోసం జిమ్‌లో వర్క్‌ అవుట్ చేసి ఫిట్‌గా రెడీ అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి

Rao Ramesh First Look: మ‌హా స‌ముద్రంలో గూని బాబ్జీ.. ఆక‌ట్టుకుంటోన్న రావు ర‌మేశ్ ఫ‌స్ట్ లుక్‌..

Pushpa: ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌లో గందపు చెక్కల స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌… సీక్వెల్‌లో నెక్ట్స్ లెవ‌ల్.. !

Acharya: ‘డబుల్ కా మీఠా… ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే సీన్స్ గ్యారంటీ.. కొర‌టాల‌ శిబిరం హామి