Poonam Pandey Death: శ్రీరాముని భక్తురాలైన పూనమ్ అయోధ్య రామోత్సవం రోజు ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

నిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిచే నటి పూనమ్ పాండే పేరు ఇక వినిపించదు. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా హైలెట్‌ అయిన ఈ అందాల తార 32 ఏళ్లకే కన్నుమూసింది. గర్భాశయ క్యాన్సర్‌తో శుక్రవారం( ఫిబ్రవరి 02)  కన్నుమూసిందామె. ఈ వార్త విని అభిమానులు, నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

Poonam Pandey Death: శ్రీరాముని భక్తురాలైన పూనమ్ అయోధ్య రామోత్సవం రోజు ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్
Poonam Pandey Death

Updated on: Feb 02, 2024 | 4:31 PM

నిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిచే నటి పూనమ్ పాండే పేరు ఇక వినిపించదు. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా హైలెట్‌ అయిన ఈ అందాల తార 32 ఏళ్లకే కన్నుమూసింది. గర్భాశయ క్యాన్సర్‌తో శుక్రవారం( ఫిబ్రవరి 02)  కన్నుమూసిందామె. ఈ వార్త విని అభిమానులు, నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. పూనమ్‌ పాండే మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నారు. సాధారణంగా పూనమ్‌ అంటేనే గ్లామర్‌కు పెట్టింది పేరు. నెట్టింట కూడా అవే ఫొటోలు, వీడియోలు కనిపిస్తాయి. అయితే పూనమ్‌ గురించి చాలామందికి తెలియని విషయమేమిటంటే ఆమె శ్రీరాముడిని అమితంగా ఆరాధిస్తుంది. అందుకే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను పూనమ్‌ పాండే ఒక పండగలా సెలబ్రేట్‌ చేసుకుంది. జనవరి 22న పూనమ్ పాండే తన ఇంట్లో రామ జెండాను ఎగురవేసింది . అనంతరం ‘జై శ్రీరామ్’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది. ఇంట్లో పూజలు నిర్వహించి ఆ సందర్భానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా పోస్ట్ చేసింది.

‘ శ్రీరాముడు వనవాసం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినట్లే. అయోధ్య శ్రీరాముడికి స్వాగతం పలుకుతోంది’ అంటూ అయోధ్య రామోత్సవం రోజు చాలామందికి శ్రీరాముడి విగ్రహాలను కానుకగా ఇచ్చింది పూనమ్‌ పాండే. చిన్నారులకు మిఠాయిలు, చిన్న చిన్న కానుకలు బహూకరించింది. పూనమ్‌ పాండే హఠాన్మరణం నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాముడిని ఎంతో ఆరాధించే పూనమ్‌ పాండే ఇప్పుడు మన మధ్యన లేకపోవడం దురదృష్టకరమంటూ అభిమానులు, నెటిజన్లు నటికి నివాళి అర్పిస్తున్నారు. కొన్ని సినిమాల్లో నటించి రియాల్టీ షోల ద్వారా ఫేమస్ అయిన పూనమ్ పాండేకు నెట్టింట చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల మంది పూనమ్‌ను ఫాలో అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

కానుకగా శ్రీరాముడి విగ్రహాలు..

చిన్నారులకు స్వీట్లు..

జై శ్రీరామ్ జెండాతో పూనమ్ పాండే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.