Actor Poonam Kaur : అందాల భామ పూనమ్ కౌర్ సినిమాల్లో కవ్విస్తూనే.. సమాజంలో జరిగే అన్యాయాలపైన తనదైన శైలిలో స్పందిస్తూ..వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై ట్వీట్లతో చాలా పాపులారిటీ తెచ్చుకుంది పూనమ్ కౌర్. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ ఫిజికల్ ఫిట్ నెస్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. తరచు యోగ చేస్తూ ఆవీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గతంలో ఈ ముద్దుగుమ్మ బురదలో యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంది. వంటికి మట్టి మేలు చేస్తుందని చెబుతూ ఆరోగ్యంగా ఉండటానికి యోగాసనాలు వేయాలని సూచించింది పూనమ్.
తన స్నేహితులతో కలిసి ఇలా బురదలో ఆసనాలు వేసింది. యోగా ఆగసనాలలో బురదలో వుండడం, బురదలో అవసరమైతే నృత్యం చేయడం వంటివి కొన్ని క్రియలు చేయాలని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అందులో భాగంగా కొందరు గ్రూప్‌గా ఏర్పడి ముందుగా ఏర్పాటు చేసుకున్న బురదగుంటలో ఇలా విన్యాసాలు చేసారు. అందులో తనకు బాగా నచ్చిన భంగిమ ఇదంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూనమ్. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తుండటంతో పూనమ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంది ఈ చిన్నది.
మరిన్ని ఇక్కడ చదవండి :