Poonam Kaur: ‘దుస్తులు కూడా వేసుకోలేకపోయా’.. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న నటి పూనమ్‌ కౌర్‌.. వీడియో

|

Feb 02, 2024 | 7:07 PM

ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోన్న పూనమ్ కాంట్రవర్సియల్‌ కామెంట్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వమున్న ఆమె ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్‌పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది పూనమ్‌ కౌర్‌.

Poonam Kaur: దుస్తులు కూడా వేసుకోలేకపోయా.. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న నటి పూనమ్‌ కౌర్‌.. వీడియో
Actress Poonam Kaur
Follow us on

పూనమ్‌ కౌర్‌.. ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేరు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. అయితే ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోన్న పూనమ్ కాంట్రవర్సియల్‌ కామెంట్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఏ విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వమున్న ఆమె ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్‌పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది పూనమ్‌ కౌర్‌. గత రెండేళ్లుగా ఫైబ్రోమైయాల్జీయా అనే ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూనమ్‌ ఫైబ్రోమైయాల్జీయా వల్ల తానెంత బాధపడిందో, అలాగే ఈ భయంకరమైన వ్యాధి లక్షణాలను వివరంగా చెప్పుకొచ్చింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది పూనమ్‌. ఇందులో ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ కూడా ఉండడం గమనార్జం.

‘2022లో తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వెళ్లాను. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుండగా ఫైబ్రోమైయాల్జీయా అనే వింత వ్యాధి ఉన్నట్లు. గత రెండేళ్లుగా ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ వ్యాధి వల్ల కనీసం దుస్తులు కూడా వేసుకోలేని దీన స్థితికి వెళ్లాను. ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత కూడా తీవ్రమైన ఒంటి నొప్పులు. బట్టలు వేసుకుంటున్నప్పుడు కూడా తీవ్రమైన నొప్పి కలిగేది. బాడీలో మూమెంట్స్ కూడా ఉండేవి కాదు. వదులైన బట్టలు వేసుకోవాల్సి వచ్చేది. అలా రెండేళ్లు ఈ వ్యాధి వల్ల నరకం చూశాను’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది పూనమ్‌ కౌర్‌. కాగా దీనికి సంబంధించిన ఫుల్‌ వీడియో త్వరలోనే బయటకు రానుంది.

ఇవి కూడా చదవండి

పూనమ్ కౌర్ షేర్ చేసిన వీడియో

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పూనమ్ కౌర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.