Pooja Hegde: ఖరీదైన కారు కొన్న బుట్టబొమ్మ.. పూజా కొత్త రేంజ్ రోవర్ ధర తెలిస్తే అవాక్కే..
బీస్ట్, రాదేశ్యామ్ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. పూజా చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటించింది. ఇక తెలుగులో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ నటిస్తోన్న గుంటూరు కారం నుంచి ఈ ముద్దుగుమ్మ తప్పుకుంది.

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. అల వైకుంఠపురంలో.. తర్వాత ఈ బ్యూటీ నటించిన ఏ ఒక్క సినిమా హిట్ కాలేదు. బీస్ట్, రాదేశ్యామ్ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. పూజా చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటించింది. ఇక తెలుగులో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ నటిస్తోన్న గుంటూరు కారం నుంచి ఈ ముద్దుగుమ్మ తప్పుకుంది. అలాగే టాలీవుడ్ మరిన్ని సినిమాలను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా పూజా హెగ్డే దసరా పండగ సందర్భంగా కొత్త కారును కొనుగోలు చేసింది. దాదాపు రూ. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసింది. ఆ కారు పనితీరు, సౌకర్యం, లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఒక లగ్జరీ SUV. ఇప్పటికే పూజా వద్ద పోర్షే కయెన్, జాగ్వార్, ఆడి క్యూ-7 ఉన్నాయి. ఇక ఇప్పటివరకు పూజా హెగ్డే దాదాపు రూ.51 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆమె ఒక్కో ప్రాజెక్టుకు రూ.4 కోట్ల వరకు.. ఎండార్స్మెంట్స్ కోసం రూ.40 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Pooja & Her family with New Car 😍@hegdepooja
#PoojaHegde pic.twitter.com/sgchVHNqLK
— Pooja Hegde (@hegdepooja_fan) October 24, 2023
ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో దేవా చిత్రంలో నటిస్తుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే పూజాకు ముంబైలోని బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఓ అపార్ట్మెంట్ ఉన్నట్లు సమాచారం.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.