Peddi Movie: ‘పెద్ది’ సినిమాలో హైలైట్‌గా నిలిచిన తలారి ఆంబ్రోస్.. ఇంతకి ఎవరీ నటుడు? బ్యాక్ గ్రౌండ్ వివరాలివే

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంది. కానీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అతనే తలారి ఆంబ్రోస్. ఫాస్ట్ బౌలర్ గా అతని యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

Peddi Movie: పెద్ది సినిమాలో హైలైట్‌గా నిలిచిన తలారి ఆంబ్రోస్.. ఇంతకి ఎవరీ నటుడు? బ్యాక్ గ్రౌండ్ వివరాలివే
Peddi Movie

Updated on: Jun 06, 2026 | 2:37 PM

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పెద్ది సినిమాకు రెండు రోజుల్లో 180 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఒక్క తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ పెద్ది సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో భారీ తారగణమే ఉంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ అదరగొట్టేసింది. అలాగే గౌర్నాయుడు పాత్రలో శివరాజ్ కుమార్ నటన కూడా నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. వీరితో పాటు జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, టినూ ఆనంద్, శ్రీకాంత్ అయ్యంగార్, హరీష్ పేరడి, తారక్ పొన్నప్ప, మహేష్ అచంట.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ది సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపిస్తారు. అయితే వీరందరి మధ్యలోనూ ఓ క్యారెక్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అతనే తలారి అంబ్రోస్. పెద్ది సినిమాలో ఫాస్ట్ బౌలర్ పాత్రలో కనిపించిన ఈ నటుడు బాగా హైలైట్ అయ్యాడు. తన నటనతో, ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు. ముఖ్యంగా రామ్ చరణ్, ఆంబ్రోస్ ల మధ్య వచ్చే సీన్లు ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పవచ్చు.

 

ఇవి కూడా చదవండి

 

విండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్ లీ అంబ్రోస్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసే ఉంటుంది. బహుశా ఈ క్రికెటర్ స్ఫూర్తితోనే ఈ తలారి ఆంబ్రోస్ పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ తలారి ఆంబ్రోస్ పాత్రను పోషించిన నటుడి పేరు శిబిన్ రాఘవ్. ఇతనొక మలయాళ నటుడు. అంతుకు ముందు కేరళలో మోడల్ గా చేసేవాడు. పలు మలయాళం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇదే క్రమంలో కల్యాణ్ ప్రియదర్శన్ నటించిన లోక చాప్టర్ 1 సినిమాతో శిబిన్ రాఘవ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమా రిలీజ్ తర్వాత శిబిన్ రాఘవ్ పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగుతోంది. మలయాళ నటుడి అభినయానికి అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబుతో శిబిన్ రాఘవ్..

 

ఈ క్రమంలోనే శిబిన్ కూడా పెద్ది సినిమా షూటింగ్ లో దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదే సందర్భంగా పెద్ది సినిమాను గ్రాండ్ సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్టులో తనకు స్థానం కల్పించిన రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు శిబిన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us